ధాన్యం కొనుగోళ్ల‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు కార్యాచరణ గానీ, ప్రణాళిక గానీ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింద‌ని ప్ర‌భుత్వ మాజీ విప్‌, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల‌పై గురువారం ఆమె మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే ఐకేపీ సెంటర్ ద్వారా గానీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాల‌న్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింద‌ని, ఈరోజు అదే రైతు మళ్లీ గోస పడుతున్న‌ట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కళ్లు తెరిచి ఎక్కడిక‌క్క‌డ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టుగా కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్ల‌పై ప్ర‌ణాళిక లేని ప్ర‌భుత్వం : గొంగ‌డి సునీత‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *